Chandrababu Crying : ప్రెస్ మీట్ లో మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు..!

Chandrababu Crying : ప్రెస్ మీట్ లో మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు..!
Chandrababu Crying : నిండు సభలో తన కుటుంబ విషయం ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

Chandrababu Crying : నిండు సభలో తన కుటుంబ విషయం ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దీంతో తాను సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తానని శపథం చేశారు. అధికారపార్టీ వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగుతోందని ఆవేదన చెందారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు.. మాట్లాడుతుండగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎప్పుడూ లేనిది చంద్రబాబు అలా కనిపించేసరికీ ఆయన సహచరులంతా ఉద్వేగానికి లోనయ్యారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారని, బూతులు తిట్టారని అయినప్పటికి భరించామని అన్నారు. అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

ఇక ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులని నా జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేదని, గౌరవంగానే వ్యవహరించామని అన్నారు. తాను జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశామని, ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీలయ్యేవాళ్లమని కానీ ఈ రోజు ఘటనలను ఏ విధంగా అభివర్ణించాలో అర్ధం కావడం లేదని తెలిపారు.

చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ జీవితం. 40 ఏళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్న ఆయన ఎప్పుడూ లోతైన మనిషే. కష్టమొస్తే ఆ బాధను కనిపించనివ్వరు. సంతోషమొచ్చిందని అలా ఆ సంబరాన్నీ బయటకు చూపించరు. అంతటి స్థిత ప్రజ్ఞతతో రాజకీయాల్లో తనదైన మార్క్‌తో కనిపించే చంద్రబాబు ఇవాళ కన్నీరు ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం అందరి హృదయాల్ని కలచివేసింది.

జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద లీడర్లతో కలిసి పనిచేసిన తాను.. ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఘటనలతో చాలా ఫీల్ అయ్యానని ఆయన తడబడుతున్న మాటలతో చెప్పడం చూసి అందరి హృదయాలు ద్రవించాయి. రాజకీయాల్లో ఎన్నో సవాళ్లుంటాయి. ఓటములుంటాయ్. గెలుపులు ఉంటాయి.

ప్రత్యర్థుల విమర్శలు ఉంటాయి. ఎదురుదాడులు ఉంటాయ్‌. కానీ వాటన్నింటినీ మాటకు మాటతోనే ఎదుర్కోవాల్సిన అధికపక్షం ఇవాళ నీచస్థాయికి దిగజారి వ్యక్తిగతంగా విమర్శలకు దిగిందనేదే చంద్రబాబు ఆవేదన. చివరికి తన భార్యను, కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తూ YCP సభ్యులు విమర్శలు చేసే సరికి ఆయన తట్టుకోలేకపోయారు.

Tags

Read MoreRead Less
Next Story