Chandrababu Naidu : ఫస్ట్‌టైమ్ చంద్రబాబు కన్నీరు.. ఉబికివస్తున్న కన్నీరు ఆపుకోలేక..!

Chandrababu Naidu :  ఫస్ట్‌టైమ్ చంద్రబాబు కన్నీరు.. ఉబికివస్తున్న కన్నీరు ఆపుకోలేక..!
X
Chandrababu Naidu : ఫస్ట్‌టైమ్ చంద్రబాబు కన్నీరు పెట్టారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. భోరున విలపించారు.

Chandrababu Naidu : ఫస్ట్‌టైమ్ చంద్రబాబు కన్నీరు పెట్టారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. భోరున విలపించారు. దాదాపు నిమిషం పాటు ఉబికివస్తున్న కన్నీరు ఆపుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, మాటలు రాక వెక్కివెక్కి ఏడ్చారు. ఎంతగా కన్నీరు ఆపుకుందామని ప్రయత్నించినా ఆయన వల్ల కాలేదు. తన్నుకొస్తున్న దుఖాన్ని ఎంతగా కంట్రోల్ చేసుకోవాలన్నా ఆయన వల్ల కానే కాలేదు. ఎప్పుడూ గంభీరంగా ఉండే వ్యక్తి, సాధ్యమైనంతవరకూ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుని కనిపించే ఆయన.. ఇలా అందరిముందు చిన్నబోయి, బేలతనంతో కన్నీరుపెట్టడం చూసి MLAలు, నేతలు కూడా కన్నీరుపెట్టారు. ప్రెస్‌మీట్‌ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. దాదాపు 2 నిమిషాల తర్వాత ఆయన ఉబికివస్తున్న కన్నీరుని ఆపుకుని తిరిగి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అవమానాన్ని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్రమైన ఆవేదనతో గద్గద స్వరంతోనే మాట్లాడారు.

Tags

Next Story