ప్రజా బలం నాకుంది.. అదే శాశ్వతం : చంద్రబాబు

కుప్పం నియోజకవర్గం రామకప్పంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. పూలవర్షంతో స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు. ఎటూ చూసినా జనసంద్రంగా మారింది. అశేష జనవాహిని మధ్య రామకుప్పం టౌన్ లో చంద్రబాబు రోడ్‌షో కొనసాగింది. చంద్రబాబుకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. మహిళల హారతులతో స్వాగతం పలికారు.
రామకుప్పం రోడ్‌షోలో... విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఎన్నికల్లో ఎప్పూడు గెలవని సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా తనను విమర్శిస్తున్నాడంటూ ఎద్దేవే చేశారు చంద్రబాబు. తనను విమర్శించేముందు సజ్జల అర్హత ఎంటో తెలుసుకోవాలన్నారు. ప్రజాబలం తమకుందని, అదే శాశ్వతమన్నారు.
గెస్ట్ హౌస్ లో విద్యుత్ సరఫరా ఎందుకు ఆపారని ప్రశ్నించారు. జనరేటర్ పనిచేయకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనను అవమానించేలా ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com