CBN: జగన్‌.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

CBN: జగన్‌.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

అభివృద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్దమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ సిద్దమా అని నిలదీశారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దామని,చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అని ప్రశ్నించారు. జగన్ సిద్దం అని సభలు పెట్టి, అశుద్దం మాటలు చెపుతున్నాడని దుయ్యబట్టారు.జగన్ 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్ అని చంద్రబాబు ఎద్దేవాచేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టాడని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఆక్షేపించారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ది కాదు, ఏ ఊరుకెళ్లినా 5 ఏళ్ల పాలనా విధ్వంసం కనిపిస్తోందని మండిపడ్డారు.


మరోవైపు.. కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీసులు ఇష్టారాజ్యంగా తెలుగుదేశం నాయకులపై రౌడీషీట్లు తెరుస్తున్నారంటూ.. డీజీపీ, ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన......... కొందరు పోలీసులు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. కుప్పం, రామకుప్పం మండలాల్లో 11 మంది నాయకులపై.... రౌడీ షీట్ తెరిచినట్టు ప్రస్తావించారు. ఎన్నికల్లో చురుగ్గా పనిచేయకూడదనే తప్పుడు కేసులు, రౌడీషీట్లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులపై పెట్టిన రౌడీషీట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నినాసంలో మూడు రోజులు నిర్వహించిన రాజశ్యామల యాగం ఇవాళ ముగిసింది. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన...యాభై మంది రుత్వికులు..చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పూజాక్రతువులు చేయించారు. మూడో రోజు సాయంత్రం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పరిసమాప్తమైంది.

Tags

Read MoreRead Less
Next Story