Nara Lokesh: 90 నిమిషాల్లో టీసీఎస్ తెచ్చా: లోకేశ్

Nara Lokesh: 90 నిమిషాల్లో టీసీఎస్ తెచ్చా: లోకేశ్
X
అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేశ్

అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రపంచమంతా ఏపీవైపు చూస్తుందంటే అందుకు కారణం సీఎం చంద్ర‌బాబే అన్నారు. ఐటీ మంత్రిగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్‌తో కేవలం 90 నిమిషాలు చర్చించి టీసీఎస్ తేగలిగానంటే దానికి కారణం కూడా చంద్రబాబే అన్నారు. ఒక్క మెయిల్‌తో సత్యనాదెళ్ల అపాయింట్ మెంట్ ఇచ్చారని, తాను ఏదిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా రెడ్ కార్పెట్‌తో వెల్కమ్ చెబుతున్నారన్నారు.

ఏపీకి బయల్దేరిన లోకేశ్

మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన ముగిసింది. ఇవాళ ఏపీకి బయల్దేరారు. వారం రోజుల తన పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు, ప్రెసిడెంట్‌లు, వైఎస్ ప్రెసిడెంట్లతో భేటీ అయిన లోకేశ్.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు పాలనలో ఏపీకి పూర్వ వైభవం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి దిగ్గజ సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయి. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం వదిలి వెళ్లిన లూలు గ్రూప్ సంస్థ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు.

నంబియార్‌ మృతిపై చంద్రబాబు సంతాపం

బీపీఎల్‌ గ్రూప్ ఛైర్మన్‌ టీపీ గోపాలన్ నంబియార్‌ మృతి పట్ల ఏపీ సీఎం‌ చంద్రబాబు సంతాపం తెలియజేశారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. తన అద్భుత నాయకత్వంతో బీపీఎల్‌ను అందరి ప్రియమైన బ్రాండ్‌గా మార్చాడన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని సీఎం‌ చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.

Tags

Next Story