lokesh: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్‌కు కీలక భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని నేతల నుంచి అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో జరగనున్న మహానాడు సందర్భంగా ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సమావేశంలో లోకేశ్‌కు కొత్త బాధ్యతలు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా పార్టీ వ్యవహారాలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నప్పటికీ.. క్రియాశీల వ్యవహారాలన్నీ లోకేశ్‌కు అప్పగిస్తే పార్టీ పటిష్ఠంగా ఉంటుందని.. వైసీపీ నేతల అరాచకాలను సమర్థంగా ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకోవచ్చని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. లోకేశ్ కూడా కొంతకాలంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించి పార్టీపై మరింత దృష్టి సారిస్తే.. భవిష్యత్‌లో తెలుగుదేశానికి తిరుగుండదంటూ అన్ని మినీ మహానాడుల్లోనూ ప్రతిపాదించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం ఆయనకే సాధ్యమవుతుందని.. నాయకత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com