ఒక్క ఛాన్స్ అంటూ సీఎం ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గనిస్తాన్‌లా మార్చారు: లోకేష్

ఏపీ సీఎం జగన్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.. ఒక్క ఛాన్స్ అంటూ ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చారంటూ ఫైరయ్యారు.. ముఖ్యమంత్రి జగన్ చేతగానితనాన్ని అసులుగా తీసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు.. నెల్లూరులో మహిళపై జరిగిన అరాచకాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు లోకేష్.. మహిళను అత్యంత దారుణంగా హింసించడమే కాక వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందన్నారు.. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డపై దాడులకు తెగబడుతున్నారన్నారు లోకేష్.. నిందితుల్ని పట్టుకొని బెయిల్‌పై అతిథి మర్యాదలతో ఇంటి వద్ద దింపడం కాదని, వారిని కఠినంగా శిక్షించినప్పుడే ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని లోకేష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com