జగన్‌ ఏపీని మరో బీహార్‌లా మారుస్తున్నారు : లోకేష్‌

జగన్‌ ఏపీని మరో బీహార్‌లా మారుస్తున్నారు : లోకేష్‌
రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగానికి బదులుగా... రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. జగన్‌ ఏపీని మరో బీహార్‌లా మారుస్తున్నారని విమర్శించారు.

ఏపీలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగానికి బదులుగా... రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. జగన్‌ ఏపీని మరో బీహార్‌లా మారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయంలో దళితులపై దాడి చేయాలంటే భయపడేవారని అన్నారు నారా లోకేష్.

నారా లోకేష్‌ సమక్షంలో పార్టీలో చేరారు గుంటూరు వైసీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కంచర్ల దేవదానం, అతని అనుచరులు. ఈ మేరకు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లోకేష్‌. ఈ సందర్భంగా వైసీపీ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు లోకేష్‌.

Tags

Next Story