రాష్ట్రంలో సైకో రెడ్డి పాలన జరుగుతోంది : నారా లోకేష్

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రలో జగన్ సైకో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త గరికపాటి కృష్ణారావు కుటుంబసభ్యులను లోకేష్ పరామర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కాకుండా జగన్ ఫ్యాక్షన్ తరహా పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దళిత నాయకురాలిని సర్పంచ్ చేశారన్న కక్షతో కృష్ణారావుని హత్య చేయడం దారుణమన్నారు. అధికారంలో ఎవరూ శాశ్వతం కాదని పోలీసులు, అధికారులు గుర్తించుకోవాలన్నారు. కృష్ణారావు కుటుంబానికి టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టంచేశారు.
అంతకుముందు నారా లోకేష్ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. గుంటూరులో నేతలు లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. భారీగా తరలివచ్చారు టీడీపీ శ్రేణులు సత్తెనపల్లి నుంచి లక్కరాజుగార్లపాడు వరకు లోకేష్ వెంట కదిలివచ్చారు. దారి వెంట పూలు చల్లుకుంటూ జై చంద్రబాబు.. జై నారా లోకేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ జనసందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ లోకేష్ ముందుకు కదిలారు.
అనంతరం భారీ భారీ ర్యాలీ మధ్య లక్కరాజుగార్లపాడు చేరుకున్న లోకేష్.. ఇటీవల మరణించిన గరికపాటి కృష్ణారావు కుటుంబసభ్యులను పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు కృష్ణారావుపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన కృష్ణారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దళిత నాయకురాలిని సర్పంచ్ చేశారన్న కక్షతో వైసీపీ శ్రేణులు కృష్ణారావుపై దాడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com