13 Oct 2020 2:46 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / భారీ వర్షాలు, వరదలు...

భారీ వర్షాలు, వరదలు ముంచెత్తినా రాష్ట్రాన్ని పట్టించుకోరా? : లోకేశ్

భారీ వర్షాలు, వరదలు ముంచెత్తినా రాష్ట్రాన్ని పట్టించుకోరా? : లోకేశ్
X

భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తినా.. సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఓవైపు పంటలు మునిగి పోయాయి. రోడ్లు చెరువులయ్యాయి. సీఎం జగన్ రెడ్డికి.. ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా? అని ప్రశ్నించారు లోకేష్‌. ఒక్క రోజన్నా కాలు బయట పెట్టి బాధితుల గోడు విన్నారా? అని ప్రశ్నించారు. వరదలు.. బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా? అంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.


Next Story