ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: జగన్ తీరుపై మండిపడ్డ లోకేష్‌.. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టట్లేదంటూ..

Nara Lokesh: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మనవరాలి పెళ్లికి జగన్‌ హాజరైన ఫోటోను ట్యాగ్‌ చేస్తూ లోకేష్‌ కామెంట్స్‌ చేశారు.

Nara Lokesh, Jagan (tv5news.in)
X

Nara Lokesh, Jagan (tv5news.in)

Nara Lokesh: రాయలసీమ, నెల్లూరు ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. ఇదేమీ పట్టని సీఎం జగన్‌ పెళ్లిళ్లకు హాజరవడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తప్పుపట్టారు. జగన్‌ తీరుపై ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మనవరాలి పెళ్లికి జగన్‌ హాజరైన ఫోటోను ట్యాగ్‌ చేస్తూ లోకేష్‌ కామెంట్స్‌ చేశారు. ఇది ఊహించలేదు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదల్లో చిక్కుకుని ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. మన గౌరవనీయ ముఖ్యమంత్రికి పెళ్లిళ్లకు హాజరవడానికి సమయం ఉంటుంది గానీ, వరద బాధితులను పరామర్శించడానికి సమయం చిక్కడం లేదు అని లోకేష్‌ ఎద్దేవా చేశారు.


Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES