ఆంధ్రప్రదేశ్

Nara Lokesh : ఒకే రాష్ట్రం-ఒకే రాజధానికి వైసీపీ కట్టుబడి ఉండాలి: లోకేష్‌

Nara Lokesh : రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు చరిత్రలో నిలిపోతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

Nara Lokesh : ఒకే రాష్ట్రం-ఒకే రాజధానికి వైసీపీ కట్టుబడి ఉండాలి: లోకేష్‌
X

Nara Lokesh : రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు చరిత్రలో నిలిపోతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా... రైతులు శాంతియుతంగా పోరాడి విజయం సాధించారన్నారు. ఇది ముమ్మాటికీ రైతుల విజయమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు న్యాయ వ్యవస్థను కించపరచడం మాని... కోర్టు తీర్పును గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధానికి వైసీపీ కట్టుబడి ఉండాలన్నారు. బాబాయ్‌ వివేకాను హత్య చేయించింది అబ్బాయి జగన్‌రెడ్డేనని ఆరోపించారు లోకేష్‌. అవినాష్‌ రెడ్డే హంతకుడని తేలిపోయిందన్నారు. ఇక జగన్‌ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నాడు నారాసుర రక్త చరిత్ర అంటూ అసత్యాలు ప్రచారం చేశారని... నేడు వివేకాపై గొడ్డలి వేటుతో జగనాసుర రక్త చరిత్ర అని అందరికీ అర్థమయ్యిందన్నారు నారా లోకేష్‌.

Next Story

RELATED STORIES