సీఎం వైసీపీ నిరుద్యోగులకు పట్టంకట్టారు : లోకేష్

X
By - Gunnesh UV |22 July 2021 6:30 PM IST
వైసీపీ నిరుద్యోగులకు పట్టం కట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారని ధ్వజమెత్తారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్.
వైసీపీ నిరుద్యోగులకు పట్టం కట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారని ధ్వజమెత్తారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. నిరుద్యోగులు ఆత్మహత్యచేసుకుంటున్నా... సీఎంకు గతంలో ఇచ్చిన హామీలు గుర్తుకు రావడంలేదనా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా పర్ల గ్రామానికి చెందిన నిరుద్యోగి రమేష్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్ చేశారు. రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇచ్చిన మాటప్రకారం ఉద్యోగాలు కల్పించాలని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com