Nara Lokesh : కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది : లోకేష్

Nara Lokesh : కల్తీసారా వాస్తావలు బయటికొస్తాయనే ప్రభుత్వం చర్చకు భయపడి పారిపోతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయన్నారు.. కొన్ని రసాయనాలు సైనేడ్‌గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయన్నారు లోకేష్.
మండలిలోని విపక్ష సభ్యుడిపై అసెంబ్లీలో విమర్శలు చేస్తుంటే సీఎం, స్పీకర్ నవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు నారా లోకేష్.. తన కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి ఇదే సంస్కారాన్ని నేర్పుతున్నారా అని నిలదీశారు.. ఎన్ని అవమానాలు ఎదురైనా తాము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని లోకేష్ స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించమంటే స్పీకర్ మార్షల్స్‌ని రమ్మంటున్నారంటూ లోకేష్ సెటైర్లు వేశారు.. మంత్రులు బొత్స, కొడాలి నాని తరహాలో మా సభ్యులెవరూ ప్రవర్తించడం లేదని గుర్తు చేశారు.. కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ను బొత్స కుటుంబ కులం పేరుతో దూషించారని, కొడాలి నాని ఛైర్మన్ టేబుల్ ఎక్కిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com