అమరావతి ప్రజా రాజధాని: నారా లోకేష్

అమరావతి ప్రజా రాజధాని: నారా లోకేష్
X

ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి....గెలిచాక జగన్‌ మాట తప్పారని లోకేష్ మండిపడ్డారు. మూడుముక్కలాట ఆడి మూడు ఇటుకలు కూడా పేర్చలేదన్నారు. అమరావతి రైతులు అనేక రకాల అవమానాలు ఎదుర్కొన్నారని....లాఠీ దెబ్బలు తిన్నారని చెప్పారు. జగన్ మాటలకు ఆనాడు అందరూ మోసపోయారని అన్నారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి.... మిగతా వారికి న్యాయం చేస్తారా? అని లోకేష్‌ ప్రశ్నించారు. 5 కోట్ల ఆంధ్రుల కోసమే అమరావతి రైతుల పోరాటం సాగుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

రావెల శివార్లలో జరిగిన అమరావతి ఆక్రందన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. అమరావతి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖిలో 29 గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పోలీసులు, ప్రభుత్వం తమపై చేసిన దాడులను, అవమానాలను వారు లోకేష్‌కు వివరించారు.

అమరావతి ఆక్రందన కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజెంటర్‌గా వ్యవహరించారు. తానెప్పుడూ రైతుల పక్షమేనని....గతంలో తనను బెదిరించి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేశారన్నారు. ఏమైనా చంద్రబాబు వచ్చాక అమరావతిని అభివృద్ధి చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story