Nara Lokesh : హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ప్రచారాలు.. లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh : హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ప్రచారాలు.. లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
X

హెరిటేజ్ పై మొదటి నుంచి వైసీపీ ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన సంస్థ కాబట్టి.. ఏదో ఒక రకంగా అప్రదిష్టపాలు చేయాలన్నది మాజీ సీఎం జగన్ అండ్ బ్యాచ్ ప్లాన్. ఎందుకంటే జగన్ నిర్వహిస్తున్న అక్రమ కంపెనీలు, అక్రమ ఆస్తులు అన్నీ కేసుల్లోనే ఉన్నాయి. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడకు చెందిన కంపెనీలపై కూడా ఏదో ఒక రకంగా కేసు పెట్టించాలన్నదే జగన్ ప్లాన్. అందులో భాగంగానే ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు లింక్ ఉందని తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు వీఎస్ ఆర్ కంపెనీతో హెరిటేజ్ కు లింక్ ఉందని ఏవేవో కట్టు కథలు రాస్తున్నారు. అయితే ఇలాంటి కథనాలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించి కౌంటర్ ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీతో ఎలాంటి లింక్ లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా వెళ్లి హెరిటేజ్ నిరూపించుకుంది.

ఇప్పుడు వీఎస్ ఆర్ ఏవియేషన్ కంపెనీతో కూడా హెరిటేజ్ కు ఎలాంటి లింక్ లేదని లోకేష్‌ బయటపెట్టారు. హెరిటేజ్ ఫిన్ కంపెనీ వద్ద వీఎస్ ఆర్ ఫైనాన్స్ మాత్రమే తీసుకుందని.. అంతకు మించి ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. అందుకు తగ్గ సాక్ష్యాలను కూడా చూపించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలకు ఒక్క సాక్ష్యం అయినా చూపించాలని డిమాండ్ చేశారు. వీఎస్ ఆర్ తో హెరిటేజ్ కు ఎలాంటి లింక్ లేదని తాను వంద సాక్ష్యాలను చూపిస్తానంటూ సవాల్ విసిరారు.

ఇలాంటి పసలేని ఆరోపణలతో వైసీపీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సరే జనాలు పట్టించుకోరంటూ లోకేష్ మండిపడ్డారు. దీంతో వైసీపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. అజిత్ పవార్ కేసులో వీఎస్ ఆర్ కంపెనీ మీద ఆరోపణలు ఉంటే.. ఆ కంపెనీ ఎవరి వద్ద ఎలాంటి రుణాలు తీసుకున్నా సరే వారితో సంబంధాలు ఉన్నట్టు ఎలా అవుతుంది. ఆ మాత్రం కూడా తెలియకుండా వైసీపీ ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడుతున్నారు నెటిజన్లు.

Tags

Next Story