ఇంటి ముందుకు రేషన్ అని నమ్మించి ఇప్పుడు చేస్తోందేంటి..? : లోకేష్‌

ఇంటి ముందుకు రేషన్ అని నమ్మించి ఇప్పుడు చేస్తోందేంటి..? : లోకేష్‌
ప్రత్యేక హోదాపై మాట్లాడని YCP ఎంపీలు.. ఇప్పుడు ఉక్కు కర్మాగారంపై కూడా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారని లోకేష్ అన్నారు.

రోడ్లకు గుంతలే పూడ్చని ఈ YCP పాలనలో.. ప్రజలకు అన్నీ కష్టాలేనని మండిపడ్డారు నారా లోకేష్. గాజువాకలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన.. సిమెంటు, ఇసుక ధరలు పెరగి, ప్రజలు ఉపాధిలేక అల్లాడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేషన్ డోర్ డెలివరీ మొదలు.. ప్రతి విషయంలోనూ జగన్ విఫలమయ్యారన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడని YCP ఎంపీలు.. ఇప్పుడు ఉక్కు కర్మాగారంపై కూడా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో లోకేష్ ప్రచారానికి మంచి స్పందన రావడంతో టీడీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోసం 10 వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేశామని.. ఇంటిపన్ను తగ్గింపు సహా ఇతర హామీలు నిలబెట్టుకుంటామని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story