1 March 2021 12:30 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / జగన్ రెడ్డి పాలనలో...

జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోంది : వైసీపీ ప్రభుత్వం పై నారా లోకేష్ ఫైర్..!

విజయనగరం జిల్లా గుర్ల సమీపంలో యువతిపై జరిగిన దారుణ సంఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోంది : వైసీపీ ప్రభుత్వం పై నారా లోకేష్ ఫైర్..!
X

విజయనగరం జిల్లా గుర్ల సమీపంలో యువతిపై జరిగిన దారుణ సంఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. యువతిపై దాడి చేసి చెట్ల పొదల్లో పడేయడం అత్యంత పాశవిక చర్యగా అభివర్ణించారు. జగన్ బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. లేని దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని స్వయంగా సీఎం మాయమాటలు చెప్పడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతుందన్న నారా లోకేష్.. రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో విజయనగరం ఘటనే అద్దం పడుతుందన్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించి.. దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని లోకేష్ తెలిపారు.

Next Story