Lokesh : జగన్ ఓ పిరికిపంద ఫ్యాక్షనిస్ట్ : నారా లోకేష్

Lokesh : చిత్తూరు జిల్లా జైలులో ఉన్న టీడీపీ నేతలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవలి చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాక టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులుతో పాటు మరో నలుగురు టీడీపీ నేతలతో ములాఖత్ సమయంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఏపీ ఎలా తయారువుతుందో ఇపుడు అందరికీ అవగతమవుతోందన్నారు నారా లోకేష్. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, జగన్ ఓ పిరికిపంద ఫ్యాక్షనిస్ట్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019 నుండి 5 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్యలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కేసులు పెడితే భయపడతామని జగన్ అనుకుంటున్నారని, భయమనేది టీడీపీ బయోడేటాలోనే లేదని స్పష్టం చేశారు.
కుప్పానికి జగన్ ఇడుపులపాయ పంచాయితీలు, రౌడీయిజం తీసుకొచ్చారని లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు, అభిమానుల సహకారంతో రాష్ట్రంలో ఊరుఊరునా అన్న క్యాంటీన్ లు ప్రారంభిస్తామన్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com