వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన లోకేష్..

వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన లోకేష్..
పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ ఆరోపించారు.

కావలి సభలో జగన్ సర్కారుపై టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పేదలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు.కోవూరు-కావలి నియోజకవర్గాల పరిధిలోని యానాది సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. సభా వేదికగా హామీలు గుప్పించిన టీడీపీ యువనేత వైసీపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ యానాదులను పట్టించుకోలేదని విమర్శించారు.యానాది కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసారని ఫైర్ అయ్యారు. ఎస్టీలకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి జగన్‌ మోసం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యానాది వర్గాన్ని ఆదుకుంటామని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ గురుకుల పాఠశాలలు తిరిగి బలోపేతం చేస్తామని చెప్పారు. పెళ్లి కానుక పథకాన్ని తిరిగి పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.యానాదులకు పక్కా ఇళ్లతో పాటు ఐటీడీఏకి ప్రత్యేక ఐఏఎస్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story