Nara Lokesh : ఏపీలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకాలు..!

Nara Lokesh : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దయ్యేలా పోరాటం చేసి, ప్రభుత్వంపై విజయం సాధించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు పొలిటికల్ హాట్ స్టార్‌గా మారిపోయారు.. లోకేష్ వల్లే టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు సాధ్యమైందంటూ ఆయన్ను కొనియాడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణగా నిలిచిన లోకేష్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. విజయనగరంలో లోకేష్ ఫ్లెక్సీలకు TNSF అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తారక రామానాయుడుతోపాటు పలువురు నేతలు పాలాభిషేకం చేశారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నారా లోకేష్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు తెలుగు విద్యార్థి సంఘం నాయకులు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. లోకేష్ పోరాటం వల్లే ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయన్నారు. ఇకనైనా ప్రజలు, విద్యార్థుల ప్రాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని హితవు పలికారు.
విజయవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.. లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసే వరకు లోకేష్ పోరాటం చేశారని కొనియాడారు.. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలంటూ హితవు పలికారు.
టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కసం అవిశ్రాంత పోరాటం చేసి విజయం సాధించిన లోకేష్‌కు పార్టీ శ్రేణులు జేజేలు పలుకుతున్నాయి. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లోకేష్ ఒత్తిడి వల్లే ప్రభుత్వం పరీక్షల విషయంలో వెనక్కు తగ్గిందన్నారు టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com