Nara Lokesh Letter To CM Jagan : ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

Nara Lokesh Letter To CM Jagan : ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ
Nara Lokesh Letter To CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. సెమిస్టర్‌ పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించాలని లేఖలో కోరారు.

Nara Lokesh Letter To CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. సెమిస్టర్‌ పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచించాలని లేఖలో కోరారు.. అందరి డిమాండ్‌తో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిని అభినందించారు లోకేష్. విద్యార్థులకు జరగబోయే సెమిస్టర్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరీక్షలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ వచ్చిందన్నారు. కోవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజల సహకారంతో కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమన్నారు లోకేష్‌.

రానున్న రోజుల్లో అనేక మంది విద్యార్థులు ఎదుర్కోనున్న పరీక్షల సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు లోకేష్‌. వివిధ విశ్వ విద్యాలయాలు, కాలేజీల విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేసినందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని 53 యూనివర్సిటీల పరిధిలో 3,500కుపైగా ఉన్నత విద్యాసంస్థలతోపాటు వేలాది కాలేజీలు, ఇతర శిక్షణా కేంద్రాలు, దూర విద్య కేంద్రాలు.. ఇలా అన్నీంటిలో 17 లక్షల మందికిగా విద్యార్థులున్నారని.. సెమిస్టర్‌ పరీక్షలు వీరంతా రాయాల్సి వున్న నేపథ్యంలో మళ్లీ కరోనా ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రమంతటా జరిగే పరీక్షల ప్రక్రియ వల్ల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, అధ్యాపకులకు ప్రాణాంతకమని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని లోకేష్‌ చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణ వల్ల కరోనా వ్యాప్తి చెంది మూడో దశ వచ్చే ప్రమాదం పొంచివుందన్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా మంది విద్యార్థులు టీకా వేయించుకోని విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.

ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదమని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణ వద్దంటూ కేరళ, కర్నాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు ప్రారంభించారని, ఆ పరిస్థితి ఏపీలో రాకుండా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి అందరి అభిప్రాయాలతో పరీక్షల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు లోకేష్‌.

Tags

Next Story