కడపలో లోకేష్‌ మాస్‌ క్రేజ్‌

కడపలో లోకేష్‌ మాస్‌ క్రేజ్‌
సీఎం స్వంత జిల్లా కడపలో కనీవినీ రీతిలో సాగుతుంది. కడప జిల్లాలో లోకేష్‌ యువగళం జన ప్రభంజనంలా సాగుతోంది

లోకేష్‌ పాదయాత్ర రోజురోజుకూ సునామీని తలపిస్తుంది. ముఖ్యంగా సీఎం స్వంత జిల్లా కడపలో కనీవినీ రీతిలో సాగుతుంది. కడప జిల్లాలో లోకేష్‌ యువగళం జన ప్రభంజనంలా సాగుతోంది.యువతలో పోరాట స్ఫూర్తి రగులుస్తున్న లోకేష్ కు పల్లె,పట్టణం అన్న తేడా లేకుండా జనం తరలి వస్తున్నారు.అన్ని వర్గాల ప్రజలతో లోకేష్‌ మమేకం అవుతూ ముందుకు సాగుతుంటే లోకేష్‌ వెంట జనం పోటెత్తుతున్నారు.భావితరాల భవిష్యత్ టీడీపీ తోనే అన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

లోకేష్ తన పాదయాత్రలో అడుగడుగునా ఆయా ప్రాంతాల కష్టాలను ఆకలింపు చేసుకుంటున్నాడు. తను వేసే ప్రతి అడుగులోను స్థానిక రాజకీయ స్వరూపాన్ని ఇట్టే పసిగట్టేస్తున్నాడు.పాదయాత్ర అనుసంధానం చేసే ప్రతి చౌరస్తాలో తనను కలిసే ప్రజల కష్టాలను ఓపిగ్గా వింటూ ప్రాంతాల వారీగా ప్రజల మద్దతును చూర గొంటున్నాడు.స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులను దగ్గరగా గమనిస్తున్న లోకేష్ తన ప్రసంగంలో ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా నేరుగా జగన్ పై విమర్శల వాన కురిపిస్తున్నాడు.ఈ నేపథ్యమే ప్రజలను తీవ్రంగా ఆకట్టుకుంటుంది.

అటు జగన్‌కు గట్టి పట్టున్న జమ్మలమడుగు,ప్రొద్దుటూరులలో నిర్వహించిన బహిరంగ సభకు పోటుత్తిన జనాలనుచూసి లోకేష్ తన షెడ్యూల్ ను కడప జిల్లాలో విస్తృతం చేశారు. పురవీధుల్లోస్థానిక చేనేత, వైశ్య, బీసీ వర్గాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్రను అనుసరించారు.దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఈ నేపధ్యంలోనే టీడీపీలో ఆశావహుల జాబితా రోజు రోజుకికి పెరిగిపోతోంది.కడప గడపలో టీడీపీ టికెట్ పై కొనసాగుతున్న పోటీ తత్వమే వైసీపీ రాజకీయ అస్థిరతకు కారణమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర జరుగుతుండగా వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ ఏర్పాటు చేసిన ప్లకార్డులు తీసివేయాలంటూ డీఎస్పీ నాగరాజు హుకుం జారీ చేశారు. ఆ ప్లకార్డులను పోలీసులు లాగేసే ప్రయత్నం చేశారు. దీనిపై మండిపడ్డారు లోకేష్‌..... ప్లకార్డులు, ఫ్లెక్సీలు తీసేది లేదంటూ డీఎస్పీకి తేల్చి చెప్పారు. వైసీపీ కవింపు చర్యలు కోడిగుడ్ల దాడులను సమర్థవంతంగా తెలుగు తమ్ముళ్లు తిప్పి కొట్టడంతో పాదయాత్రకు మరింత జోష్‌ పెరిగింది.వైసీపీ సర్కార్ పై నారా లోకేష్ చేస్తున్న పోరాటం రాజకీయ విమర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. లోకేష్ విసురుతున్న పదునైన విమర్శల ధాటికి సభ ఈలలు, కేకలు కేరింతలతో మార్మోగిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story