అరెస్ట్‌ను నిరసిస్తూ భోజనం చేయని లోకేష్.. స్టేషన్‌లోనే ఆందోళనకు..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను అరెస్ట్ చేసి ఐదు గంటల పాటు ప్రత్తిపాడు పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు... ఇప్పుడు అక్కడి నుంచి మరో చోటకు తరలిస్తున్నారు. గుంటూరు పాత పీఎస్‌కా? పెదనందిపాడు పోలీస్‌స్టేషన్‌కా? అనేదానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ రెండు పీఎస్‌లకు కూడా తీసుకెళ్లడం లేదని, వేరే ఏ స్టేషన్‌కు అనే విషయం కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని లోకేష్‌పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 353 కింద కేసు పెట్టారు. అరెస్ట్‌ను నిరసిస్తూ లోకేష్ భోజనం చేయకుండా... స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు. మరోవైపు... లోకేష్‌ను ఎక్కడికి తరలిస్తున్నారో స్పష్టత లేకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. బాధితుల్ని పరామర్శిస్తే... నిర్బంధాలు, అరెస్టులు ఏంటని నినదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com