Nara Lokesh : అమెరికా పర్యటనలో లోకేష్ బిజీబిజీ

Nara Lokesh : అమెరికా పర్యటనలో లోకేష్ బిజీబిజీ
X

మంత్రి నారా లోకేష్ ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా పెట్టుబడుల వేటలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ లాంటి ఇంటర్నేషనల్ దిగ్గజాలను ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కింది. కానీ వైసీపీ చేసిన విధ్వంసానికి అవి సరిపోవని.. మరిన్ని కంపెనీలు తీసుకురావాల్సిందే అని డిసైడ్ అయ్యారు లోకేష్. లక్షల కోట్ల పెట్టుబడులు, వందలాది కంపెనీలు ఏపీలో కొలువుదీరడమే తమ ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఏపీ యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడం, వారు బయటి రాష్ట్రాలకు జాబుల కోసం వెళ్లకుండా చేయడమే తన ముందున్న కర్తవ్యం అంటున్నారు. అందులో భాగంగానే అమెరికాలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎంతోమంది వ్యాపార దిగ్గజాలను కలుస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ కోరుతున్నారు.

ఇలా ఎన్నో కంపెనీలతో మాట్లాడుతూ ఏపీకి తీసుకువచ్చే పనిలో బిజీగా ఉన్నారు లోకేష్. తన మీద వస్తున్న విమర్శలను ఒక్కసారి కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పని లేని వారే విమర్శలు చేస్తూ కూర్చుంటారు. ఒక లక్ష్యంతో ముందుకు సాగే నాయకుడు ఎప్పుడూ ప్రత్యర్థులు చేసే పసలేని విమర్శలను పట్టించుకోడు అనేది లోకేష్ ముందు నుంచి చెబుతున్న మాట. అందుకు తగ్గట్టే అన్ని దేశాలు తిరుగుతూ దిగ్గజ కంపెనీలను ఏపీకి తీసుకువస్తూ ఇక్కడి బ్రాండ్ వాల్యూను పెంచుతున్నారు.

అందులో అతిపెద్ద సక్సెస్ గూగుల్ డేటా సెంటర్. దాన్ని చూపించే మిగతా కంపెనీలను కూడా ఈజీగా తీసుకురావడం లోకేష్ అసలైన ప్లాన్. కానీ కొందరు ఇలాంటి సమయంలో కూడా లోకేష్ ను విమర్శిస్తూ పసలేని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర కోసం పనిచేసే వ్యక్తులను విమర్శిస్తే వచ్చే లాభం ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అవసరమైతే వైసీపీ నాయకులకు తెలిసిన కంపెనీల గురించి కూడా చెప్పాలంటూ అడుగుతున్నారు. కానీ వైసీపీ నాయకులకు అలాంటి పనులు నచ్చవు కదా. అందుకే విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు.

Tags

Next Story