ఇవాళ ఒంగోలులో పర్యటించనున్న నారాలోకేష్

ఇవాళ ఒంగోలులో పర్యటించనున్న నారాలోకేష్
లోకేష్ పర్యటనను సక్సెస్ చేసేందుకు స్థానిక పార్టీశ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఇవాళ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలో రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు. రాత్రి ఒంగోలు కొత్తపట్నం బస్‌ స్టాండ్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

సాయంత్రం 4గంటలకు త్రోవగుంట నుంచి లోకేష్ ఒంగోలు చేరుకుంటారు. సాయంత్రం 4గంటల 20 నిమిషాలకు మంగమ్మ కాలేజీ జంక్షన్‌, 4గంటల 45నిమిషాలకు చంద్రయ్య నగర్, 5గంటలకు రమణరావు ఆస్పిటల్ వద్ద రోడ్ షో నిర్వహిస్తారు. 5గంటల 15 నిమిషాలకు నుంచి దిబ్బల రోడ్‌, 60అడుగుల రోడ్‌, పార్టీ ఆఫీస్ పక్కన రోడ్, నవ భారత్ ధియేటర్, గోరంట్ల ధియేటర్ జంక్షన్గో, పాల్ నగర్- కమ్మపాలెం రోడ్డులలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు కొత్తపట్నం బస్టాండ్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నారా లోకేష్‌ ప్రసంగిస్తారు. లోకేష్ పర్యటనను సక్సెస్ చేసేందుకు స్థానిక పార్టీశ్రేణులు భారీగా ఏర్పాట్లుచేశాయి.


Tags

Next Story