టీడీపీ అధికారంలోకి రాగానే ఎస్టీలకు ఇళ్లు కట్టిస్తాం: లోకేష్

టీడీపీ అధికారంలోకి రాగానే ఎస్టీలకు ఇళ్లు కట్టిస్తాం: లోకేష్
నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. లోకేష్‌ అడుగడుగునా జననీరాజనం పలుకుతున్నారు

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. లోకేష్‌ అడుగడుగునా జననీరాజనం పలుకుతున్నారు. ఎటు చూసిన జనప్రభంజనమే కన్పిస్తోంది. రహదారులన్నీ పసుపుమయంగా మారిపోతున్నాయి. యువగళం పాదయాత్ర జరిగే ప్రాంతాలన్నీ లోకేష్‌ ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలతో నిండిపోతున్నాయి. ఇక వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను లోకేష్‌ చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్‌ అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

వైసీపీ సర్కార్‌ గిరిజనులను విస్మరించిందని లోకేష్‌ ఫైరయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కల్లూరులో.. గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని లోకేష్‌ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు తెస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ జలసిరి పథకానికి పేరు మార్చి.. జలకళగా మార్చారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ జగన్‌ అటకెక్కించారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీలకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 16వందల 54కిలోమీటర్లు పూర్తి అయ్యింది. ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంంత్రం 4గంటలకు తెగచర్ల క్యాంప్ సైట్ నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. తొలుత గరిమెనపెంట చేరుకోనున్న లోకేష్‌.. అక్కడ ఎస్టీ కాలనీలో స్థానికులతో సమావేశం అవుతారు. అనంతరం న్యూ రామకూరులో స్థానికులతో సమావేశం, రామకూరు కాలనీలో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. ఇక గొనుపల్లి, పెనుబర్తి గ్రామాల్లో స్థానికులతో మాటామంతీ పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా పెనుబర్తి శివారు విడిది కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడితో 130వ రోజు లోకేష్‌ పాదయాత్ర ముగుస్తోంది. రాత్రికి లోకేష్‌ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story