ఆంధ్రప్రదేశ్

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలి : నారా లోకేష్

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి.. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలి : నారా లోకేష్
X

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి.. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా తీవ్రతపై ప్రభుత్వానికి నివేదించేందుకు టీఎన్ఎస్ఎఫ్, విద్యావేత్తలు, న్యాయనిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ వేసింది టీడీపీ. కరోనా విజృంభిస్తుందని.. పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదని లోకేష్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసిన అంశాన్ని గుర్తు చేసిన నారా లోకేష్.. ఏపీలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు.

Next Story

RELATED STORIES