రైతుల ఆనందమే చంద్రబాబు లక్ష్యం: లోకేష్

రైతుల ఆనందమే చంద్రబాబు లక్ష్యం: లోకేష్
X

సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య తీరుపై టీడీపీ యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. 63వేల మెజార్టీతో గెలిచిపించిన ప్రజలు గాలికొదిలేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ గంజాయి అమ్ముకుంటు న్నాడంటూ ఆరోపించారు. కోర్టులో కేసులో బిజీగా ఉన్న దొంగ మంత్రి కాకాణి అంటూ ఎద్దేవా చేశారు. రైతులు ఆనందంగా ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు నారా లోకేష్‌.

అధికారంలోకి రాగానే రైతులను అన్నీ విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు నారా లోకేష్‌. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులను ఆదుకున్నట్లు గుర్తుచేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాను విస్మరించాడని ఫైర్ అయ్యారు.
సైకో జగన్‌ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు నారా లోకేష్. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి తాము చెప్పుకోలేక పోయామని.. ఏ సంక్షేమం చేయలేకపోయినా వైసీపీ పబ్లిసిటీ చేసుకుందని చెప్పారు. పాదయాత్రలో ప్రజలు కష్టాలు చూసా.. కన్నీళ్లు తుడిచే బాధ్యత తనదేన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ముద్దులు పెట్టి మోసం చేశాడంటూ ఫైర్ అయ్యారు

Tags

Next Story