LOKESH: మొహమాటానికి పోయి నష్టం చేసుకోలేం

ఎన్నికలకు 5 నెలలే సమయం ఉందని.. కొంతమంది నేతల పనితీరు ఇంకా మారాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఒకటికి రెండు సార్లు చెబుతామని, మారకుంటే కష్టమన్నారు. మొహమాటానికి వెళ్లి పార్టీకి నష్టం చేయలేమని ఆయన తేల్చిచెప్పారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానసికంగా చాలా బలంగా ఉన్నారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తెలుగుదేశం నేతలకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ రాష్ట్ర విసృత్త స్థాయి సమావేశంలో ఓట్ల తొలగింపు, పార్టీ సంస్థగత నిర్మాణం, నిజం గెలావాలి అనే అంశాలపై అంతర్గతంగా చర్చ జరిగింది. చంద్రబాబు ఎనర్జీ ఎక్కడా తగ్గలేదన్న లోకేష్., కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వెల్లడించారు. వైద్య కారణాలతో తాను బయటకు రానని నాలుగు రోజులు ఆలస్యమైనా స్వచ్ఛంగా బయటకు వస్తానని చంద్రబాబు స్పష్టం చేసిన్నట్లు నాయకులకు వివరించారు. ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడీ తేవొద్దని చెప్పారన్నారు. ములాఖత్‌కి వెళ్లినప్పుడు చంద్రబాబు కుటుంబం గురించి కాకుండా నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారని లోకేశ్ తెలిపారు.
సోషల్ మీడియాపై కూడా దృష్టిసారించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఫేక్ అకౌంట్లతో టీడీపీ, జనసేన కార్యకర్తల మద్య వైసీపీ పే టీం బ్యాచ్ గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని తిప్పి కొడుతూ ప్రజల్లోకి నిజాల్ని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు . ‘అక్టోబరు 27 నుంచి ఓటర్ల ముసాయిదా జాబితా వస్తుందన్న లోకేష్... అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్‌స్థాయిల్లో మండల, గ్రామ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని ప్రజల్ని అప్రమత్తం చేయాలని లోకేశ్ సూచించారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత నిలిచిన ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని నవంబరు 1నుంచి డిసెంబరు 15వరకు లోకేశ్ చేపట్టనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు లోకేశ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అధినేత కొనసాగిస్తారు. ఈ 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వ అరాచకాల్ని వివరించాలని లోకేశ్ సూచించారు. లోకేశ్ వారంలో మూడు రోజులపాటు రోజుకో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మనకున్నది కేవలం ఐదు నెలలే గడువేనన్న లోకేష్ ‘‘సూపర్ 6 హామీల’ను ప్రజలకు చెబుదామన్నారు. పండగలు, సెలవులూ లేకుండా.... అహర్నిశలు శ్రమిద్దామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ...వారిలో చైతన్యం తెద్దాం’ అని లోకేశ్ పార్టీ నేతలతో అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com