నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ప్రమాదం తప్పింది.. లోకేష్ నడుపుతున్న ట్రాక్టర్ పక్కకు ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన లోకేష్ ట్రాక్టర్‌ను కంట్రోల్ చేశారు.. ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌పై లోకేష్‌తోపాటు టీడీపీ నేతలు చాలామందే ఉన్నారు.. పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది..
టీడీపీ నేతలతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన లోకేష్.. వరద ముంపును స్వయంగా తెలుసుకునేందుకు ట్రాక్టర్‌పై ఎక్కారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలున్నారు.. అంతా కలిసి ట్రాక్టర్‌పై వెళ్తున్నారు.. లోకేష్ ట్రాక్టర్‌ను నడుపుతున్న సమయంలో సిద్దాపురం దగ్గర అదుపుతప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది.. అప్రమత్తమైన లోకేష్ ట్రాక్టర్‌ను కంట్రోల్ చేశారు.. వెంటనే అందరూ ట్రాక్టర్‌పై నుంచి దిగారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
అంతకుముందు.. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్.. వరద బాధితుల్ని పరామర్శించారు. కొల్లేరు సరస్సు వరదతో ముంచెత్తిన పందిరిపల్లిగూడెం బాధితులతో చర్చించారు. కొల్లేరుకు ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయన్నారు. ఆ వరద బాధితుల్ని ఆదుకునే చర్యలే తీసుకోలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 2వేల500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్‌పుట్ సబిడ్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల తరపున టీడీపీ పోరాడుతుందని చెప్పారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లా రైతులు మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని లోకేష్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com