ఆంధ్రప్రదేశ్

Nara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

Nara Lokesh : సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్య పూర్తయ్యేందుకు భ‌రోసా ఇవ్వాలని లేఖలో కోరారు.

Nara Lokesh :  సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ
X

Nara Lokesh : సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్య పూర్తయ్యేందుకు భ‌రోసా ఇవ్వాలని లేఖలో కోరారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఉక్రెయిన్‌లో నుంచి విద్యార్థులు ఏపీకి చేరుకున్నారన్నారు. అయితే కొంతమందికి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించారని మరికొందరికి యూనివర్శిటీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. దీంతో వీరంతా అయోమయంలో ఉన్నారన్నారు. ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన విద్యార్థులు త‌మ కోర్సులు పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. తమిళనాడు, తెలంగాణా ప్రభుత్వాలు విద్యార్థులకు అండగా నిలిచాయన్నారు. కోర్సులు పూర్తికి చ‌ర్యలు తీసుకుంటామ‌ని ప్రక‌టించాయన్నారు. ఏపీ విద్యార్ధుల బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. మెడిసిన్‌ కోసం విదేశాలకు వెళ్లడానికి గల కార‌ణాలపై కమిటీ వేయాలన్నారు లోకేష్‌..

Next Story

RELATED STORIES