Yuvagalam: 145వ రోజుకి చేరిన యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది.145వ రోజు యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. ఇవాళ 'మహాశక్తి'తో లోకేష్ పేరిట మహిళలు, యువతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు తమ బాధల్ని లోకేష్‌కు చెప్పుకున్నారు. ఇబ్బంది పెట్టిన వారిని వదలబోనని లోకేష్ భరోసా కల్పించారు.అమ్మని మించిన దైవం లేదని, మహిళలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్ని జయించగలరన్నారు నారా లోకేష్. చంద్రబాబు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు.శాసనసభ సాక్షిగా వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మరో తల్లికి జరగకూడదనేదే తన తాపత్రయమన్నారు. తల్లిని అవమానించిన వారిని కూడా జగన్ హెచ్చరించలేదని.. జగన్ ఏం నాయకుడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి రోజాపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఓ సమస్యపై పోరాడిన తనకు చీర, గాజులు పంపిస్తామనడంపై కౌంటర్ ఇచ్చారు. చీర కట్టుకునే మహిళలు అంటే నీకు అంతా చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కడప జిల్లాలో ఓ దళిత మహిళపై దాడి జరిగితే ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు.అండగా నిలిచిన రాష్ట్ర టీడీపీ మహిళ అధ్యక్షురాలు అనితను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారని అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలపై వైసీపీ నాయకుల దాడులు ఎక్కువయ్యాయన్నారు.టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేదే టీడీపీ లక్ష్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com