Yuvagalam: జ‌నప్ర‌వాహిని మ‌ద్య లోకేష్ పాద‌యాత్ర‌

Yuvagalam: జ‌నప్ర‌వాహిని మ‌ద్య లోకేష్ పాద‌యాత్ర‌
లోకేష్‌తో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు కలిసి నడుస్తున్నారు. దారిపొడువునా అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్న లోకేష్‌కు ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

TDP యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. లోకేష్‌తో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు కలిసి నడుస్తున్నారు. దారిపొడువునా అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్న లోకేష్‌కు ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్‌ వారికి భరోసా కల్పిస్తున్నారు. దీంతో మహిళలు మంగళహారతులు పడుతున్నారు. జై లోకేష్‌, జై టీడీపీ నినాదాలతో పాదయాత్ర పరిసరాలు హోరెత్తుతున్నాయి.

నాలుగు రోజుల విరామం తర్వాత ఇవాళ లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం కడప జిల్లా జమ్మలమడుగులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. నేడు 111వ రోజు సాయంత్రం 4 గంటలకు జమ్మలముడుగు శివారు నుంచి పాదయాత్ర షురూ కానుంది. 4గంటల 20నిమిషాలకు పెద్దపసుపుల మోటు వద్ద స్థానికులతో మాటమంతీ నిర్వహిస్తారు. 4గంటల 30నిమిషాలకు సంజాముల దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతారు.

సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు పాతబస్టాండ్‌ గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో లోకేష్ ముచ్చటించనున్నారు. 6 గంటల 15 నిమిషాలకు కన్నెలూరు క్రాస్‌ వద్ద ప్రజలతో సమావేశమవుతారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ధర్మవరం క్రాస్‌ వద్ద ప్రజలతో మాట్లాడుతారు. 9 గంటలకు శేషారెడ్డిపల్లె పాలకోవా సెంటర్‌లో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు దేవగుడి సుంకులాంబ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటివరకు లోకేష్ 1,423 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు.

Tags

Read MoreRead Less
Next Story