Lokesh: వచ్చేది మన ప్రభుత్వమే: లోకేశ్

తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం మరో 3 నెలల్లో అధికారంలోకి వస్తుందని రాగానే రైతులను అన్నివిధాల ఆదుకుంటామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీనిచ్చారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 218వ రోజు యువగళం యాత్రను లోకేశ్ కొనసాగించారు. కృష్ణాపురం రోడ్డు కూడలి వద్ద తుపానుకు నీట మునిగిన పొలాన్ని పరిశీలించారు. మహిళా కూలీలతో మాట్లాడి కష్టాలు తెలుసుకున్న లోకేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా శక్తి ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఒంటిమామిడి, తొండంగిలో మత్స్యకారులు యువనేతను కలిసి..... సమస్యలు చెప్పుకున్నారు. తర్వాత కాకినాడ సెజ్ బాధిత రైతులకు సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.3 నెలల్లో ప్రజల ప్రభుత్వం వస్తుందన్న లోకేశ్ ..పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించి స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామన్నారు.యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశలతో భూములిస్తే వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ సెజ్ కోసం ఇచ్చిన భూముల్ని వైసీపీ నేతలు దోచుకున్నారని.. నిర్వాసిత రైతులు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో భూములిస్తే వైసీపీ నేతలు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెజ్ నిర్వాసితుల కష్టాలను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 218వ రోజూ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగించారు. తుని నియోజకవర్గం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర చేసిన లోకేశ్‌కు అడుగడుగునా ప్రజలునీరాజనాలుపలికారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలూ లోకేష్‌కు సంఘీభావం తెలిపారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ ముందుకు సాగిన లోకేశ్ తొండంగి మండలం కృష్ణాపురం రోడ్డు కూడలి వద్ద నీట మునిగిన పంటలను పరిశీలించారు. కాలువ దాటి పొలంలోకి వెళ్లిరైతుతో మాట్లాడారు. నిరుత్సాహ పడొద్దని... మూడు నెలలు ఓపిక పడితే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పారు. నష్టపోయిన ప్రతీ రైతునూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.అనంతరం శృంగవృక్షం చేరుకున్న లోకేశ్ కాకినాడ సెజ్ నిర్వాసిత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్ దొంగ హామీలిచ్చి తమని మోసం చేశారని రైతులు వాపోయారు. టి. తిమ్మాపురం మీదుగా తేటగుంట పంజాబీ దాబా విడిది కేంద్రం వరకూ లోకేష్ పాదయాత్ర సాగింది.
మరోవైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన వేళ ఆయనకు సంఘీభావంగా గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహ్మతా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకు తెదేపా నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోందని మోహనకృష్ణ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com