Nara Lokesh: యువగళం పాదయాత్ర..కిక్కిరిసిన కందుకూరు..

Nara Lokesh: యువగళం పాదయాత్ర..కిక్కిరిసిన కందుకూరు..
యువగళం ప్రభంజనం చూసి వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కందుకూరు కదం తొక్కింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కందుకూరు కిక్కిరిసింది. పాదయాత్రలో భాగంగా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో బహిరంగ సభకు జనం పోటెత్తారు. యువగళం దెబ్బకి వైసీపీ ప్యాకప్ ఖాయమన్నారు.యువగళం ప్రభంజనం చూసి వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.జగన్ ప్రతి స్కీమ్‌ వెనక ఒక స్కామ్‌ ఉంటుందని ఆరోపించారు.ఇప్పుడు డేటా చోరీ చేస్తున్నారని విమర్శించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వైసీపీది బాదుడు ప్రభుత్వమని లోకేష్‌ అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్‌ అన్నారని.. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని లోకేష్‌ ప్రశ్నించారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లని హెచ్చరించారు. పిల్ల కాలువ తవ్వడం రానివాడు పోలవరం పూర్తి చేస్తాడా? అని లోకేష్‌ ప్రశ్నించారు. జగన్‌ కమీషన్ల కక్కర్తితో రివర్స్ టెండరింగ్‌కి వెళ్లి ప్రాజెక్టుని ప్రమాదంలో పడేశారని మండిపడ్డారు.

ఇక లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 157వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 2070కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ కొండేపి నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర కొనసాగనుంది.సాయంత్రం 4గంటలకు మాలెపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. చెంచుపాలెం, మూలెవారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ తరువాత స్థానికులతో భేటీ అవుతారు. ఇక పాదయాత్రగా వెళ్తూ మాలెపాడులో పిచ్చిగుంట సామాజికవర్గీయులు, చుండిమడుగు వాగులో సింగరాయకొండ మండల వాసులతో పాటు రైతులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తిమ్మపాలెం వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని క్రిస్టియన్లతో భేటీ అవుతారు. ఇక తిమ్మపాలెంలో వైసీపీ ప్రభుత్వ బాధితులతో భేటీ అయి వారి సమస్యలు తెలుసుకుంటారు.

అనంతరం పాదయాత్రగా అంకిరెడ్డిపాలెం చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశం అవుతారు. అలాగే బొగనంపాడులో స్థానికులతో.. చెరుకువారిపాలెంలో నరేగా కూలీలతో... బోగనంపాడు వాటర్ ట్యాంకు వద్ద స్థానికులతో సమావేశం అవుతారు లోకేష్‌. ఇక చివరగా చెరువుకొమ్ముపాలెంలో జరుగుమిల్లి మండల ప్రజలతో భేటీ కానున్నారు.అనంతరం పాదయాత్రగా చెరుకూరివారిపాలెం శివారు విడిది కేంద్రానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు‌.

Tags

Read MoreRead Less
Next Story