సీమలో ముగిసిన యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర రాయలసీమలో ముగిసింది.వైసీపీ బలంగా ఉన్న సీమ ప్రాంతంలో పేరుపడిన గత ఎన్నికల్లో టీడీపీకి గెలిచింది మూడు అంటే మూడు సీట్లు. మరి సీమలో పాదయాత్ర అంటే అది నిజంగా ఓ సాహసమనే చెప్పాలి.కానీ సీమలో లోకేష్ పాదయాత్ర చేసిన తీరు చూస్తే జయహో లోకేష్ అనక మానరు.కుప్పంలో ప్రారంభించి బద్వేలు నుంచి కోస్తాలో అడుగుపెట్టేసరికి సీన్ మారిపోయింది. వారెవా లోకేష్ అని అనుకోని వారు లేరు. ఈ మధ్యలో జరిగినదంతా చరిత్ర.
124 రోజులపాటు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో తనతోపాటు యువగళం బృందాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాయలసీమ ప్రజలు చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరువలేనన్నారు.అడుగడుగునా సీమ ప్రజల కష్టాలను నేరుగా చూశాక తీవ్ర మనోవేదనకు గురయ్యారు రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీరు, నిరుద్యోగం, వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించానన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ ద్వారా ప్రజల కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానని యువగళం పాదయాత్ర సాక్షిగా మాట ఇస్తున్నానని లోకేష్ చెప్పారు.ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని మీ నుంచి పొందిన నేను లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించబోనన్నారు.తీవ్ర భావోగ్వేగంతో లోకేష్ అన్న ఈ మాటలతో రాయలసీమ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.. లోకేష్ ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇక కుప్పంలో మొదలైన పాదయాత్ర 124 రోజుల పాటు 44 నియోజవకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర సాగింది. కుప్పంలో యువగళం ప్రారంభమైన నాటికి లోకేష్‌తో ఉన్న జనాన్ని చూసిన అధికార వైసీపీ కవ్వింపు చర్యలకు దిగింది.ఆయన మాటల్ని ట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున తన సర్వశక్తుల్ని మోహరించింది.అయితే అధికార పార్టీకి దిమ్మతిరిగేలా పెరిగిన జనసందోహం లోకేష్ మాటల్లో పరిణితి రాజకీయాలపై ఆయన క్లారిటీ ఇవన్ని స్పష్టమయ్యే సరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రతి చోటా పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనసందోహన్ని టీడీపీ కూడా ఊహించలేదు.అంతా బ్రహ్మరధం పట్టారు సీమ వాసులు.
మరోవైపు తాను సీమ బిడ్డగా రాటుతేలిన లోకేష్ రాయలసీమ అభివృద్ధి కోసం తన విజన్‌ను ప్రజల ముందు ఉంచారు. గతంలో వైసీపీకి వన్‌సైడ్ మెజార్టీ ఇస్తే చేసిందేమీ లేదని వాళ్లు సీమ ప్రజల నెత్తిన ఎక్కారు తప్ప చేసిందేమి లేదని ఆధారాలతో సహా చూపించారు.అదే స్థాయి మద్దతు టీడీపీకి ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు. మాటల్లో కాదు చేతల్లో అంటూ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించారు. గత టీడీపీ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుంచారు. లోకేష్ ఆలోచనల్లో క్లారిటీ డొంకతిరుగుడు లేకుండా సమాధానాలు చెప్పడంతో సీమ వాసులు ఫిదా అయ్యారు.రాయలసీమ ప్రజలు కావాల్సిందేమిటో అదే తన ప్రణాళికలో చెప్పడంతో ప్రజల్లో ఓ నమ్మకం, భరోసా కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com