Yuvagalam: జనమే బలం.. 138వ రోజుకు చేరిన యువగళం

లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 138వ రోజుకు చేరింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. ఇప్పటి వరకు మొత్తం 1786 కిలోమీటర్లు నడిచారు. ఆయనకు అడుగడుగునా.. ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. ఆయనకు.. తమ సమస్యలు చెప్పుకుంంటున్నారు ప్రజలు. వారి సమస్యలు వింటున్న లోకేష్... టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ సమస్యల్నింటిని పరిష్కారిస్తామని హామీ ఇస్తున్నారు.
నాయుడుపేట బహిరంగ సభలో... జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు లోకేష్. యువగళం పాదయాత్ర చూసి జగన్ టెన్షన్‌తో పాటు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు..ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ విడిచి పెట్టేది లేదన్నారు. వైసీపీ గుండాల హింసలకు బలైన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో ఇప్పటి వరకు 9 సార్లు కరెంటు ఛార్జీలు, పెట్రోల్, ఆర్టీసీ, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచారని విమర్శించారు.
ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు లోకేష్. మహిళల కన్నీరు తుడిచే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పగలరా? అని ప్రశ్నించారు. నాయుడుపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రక్కన ఉన్న వందల ఎకరాలపై చర్చకు సిద్దమా? అని లోకేష్ సవాల్ విసిరారు. అకాల వర్షాల వలన రైతులు ఇబ్బంది పడుతుంటే.. కోర్టు దొంగ బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com