Nara Lokesh : చట్టపరంగానే వెళ్తామంటున్న లోకేష్.. ముహూర్తం ఫిక్స్ చేస్తారా..?

Nara Lokesh : చట్టపరంగానే వెళ్తామంటున్న లోకేష్.. ముహూర్తం ఫిక్స్ చేస్తారా..?
X

మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని గతంలో చాలామంది మాట్లాడారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ అందరికీ తెలుసు అని నిన్న రాజమండ్రి టిడిపి నేతల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అతను టిడిపిని భూస్థాపితం చేస్తానని చాలా డైలాగులు కొట్టాడు. మళ్లీ అధికారంలోకి వస్తే అందర్నీ జైల్లో వేస్తా అంటున్నాడు. చంద్రబాబు నాయుడుని కూడా ఇలాగే కక్ష కట్టి తప్పుడు కేసులో జైలుకు పంపించాడు. నా తల్లిని అవమానించాడు. అలాంటి వక్రబుద్ధి కలిగిన వారికి ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో మనందరం చూసాం. కానీ మేం అలాంటి అరాచకాలకు అస్సలు పాల్పడం అంటూ నారా లోకేష్ చెప్పారు. జగన్ లాగా చట్టాలను అతిక్రమించబోమని.. చట్ట ప్రకారమే వెళ్తామని తెలిపాడు.

అదే సమయంలో ఇంకో కీలక హింట్ ఇచ్చాడు. తమకు ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో బాగా తెలుసని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేస్తామన్నాడు. గత వైసిపి పాలనలో చేసిన అరాచకాలను అస్సలు వదిలిపెట్టేది లేదని, చట్ట ప్రకారమే వాళ్లను శిక్షిస్తామన్నారు. ఈ లెక్కన జగన్ కు ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ జగన్ మాత్రం మెడికల్ కాలేజీలలో పిపిపి విధానంపై నానారకాల తప్పుడు ప్రచారాలు చేస్తూ.. అందులో పెట్టుబడులు పెట్టే వారందరినీ తాము వచ్చాక జైల్లోకి పంపిస్తామంటూ బెదిరిస్తున్నాడు. నిజంగా అభివృద్ధి జరగాలి అని కోరుకునే వ్యక్తి ఇలా ఎప్పుడైనా బెదిరిస్తాడా.

ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ఎంతో సమయమనంతో, చట్టాలను గౌరవిస్తూ మాట్లాడాలి. అంతేగానీ ఇలా ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు పాల్పడటం ఏంటి. వాస్తవానికి ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే. అయినా సరే లోకేష్ మాత్రం చట్టాలను గౌరవిస్తామని చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయబోమని కక్షరాజకీయాలకు వెళ్ళబోమని చెబుతున్నారు. కాకపోతే తప్పు చేసిన వారిని కూడా వదిలిపెట్టేది ఉండదని... చట్ట ప్రకారమే వారికి శిక్షలు పడతాయని లోకేష్ హుందాగా వ్యవహరిస్తుంటే.. జగన్ మాత్రం ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story