National Media : చంద్రబాబును అవమానించిన ఘటనపై స్పందించిన జాతీయ మీడియా

National Media : అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును వైసీపీ నేతలు అవమానించిన ఘటనను జాతీయ మీడియా తీవ్రంగా స్పందించాయి. మీడియా సమావేశంలో చంద్రబాబు రోధించిన వీడియోలను జాతీయ మీడియా ప్రసారం చేశాయి. బాబు ఘటనపై స్పందించిన రిపబ్లిక్, టౌమ్స్ నౌ, ఎన్‌డీటీవీ, ఏపీఎన్ లైవ్, ఇండియా టీవీ, ఢిల్లీ ఎన్‌సీఆర్ మిర్రర్, ఆజ్‌తక్ తదితర జాతీయ న్యూస్ ఛానెళ్లు ఆ వార్తను కవర్ చేశాయి. దీంతో ఇది జాతీయ స్థాయికి చేరింది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రవర్తించారని టైమ్స్ నౌ తెలిపింది. అలాగే ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అయిన చంద్రబాబు కంటతడి పెట్టడాన్ని ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ, న్యూస్ 18, మిర్రర్ నౌ, ఆప్నా టీవీ, ఢిల్లీ ఎమ్సీఆర్ మిర్రర్ టీవీ.. వరస కథనాలు ప్రసారం చేసాయి. ఏపీలో దిగజారుతున్న తాజా రాజకీయ విలువలకు అద్దం పడుతోందని జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com