Pawan Kalyan : పవన్ హిందూ రక్షణ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ.. అమిత్ షా ఫోన్

Pawan Kalyan : పవన్ హిందూ రక్షణ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ.. అమిత్ షా ఫోన్
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనానత హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న హిందూ ఆలయాల పవిత్రత కాపాడేందుకు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ లాంటి బోర్డు ఉండాలని పవన్ ప్రతిపాదించారు. పవన్ డిమాండ్ ను ప్రముఖ ఆలయాల నుంచి పండితులు స్వాగతించారు. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. పవన్ కు ఫోన్ చేశారు. లడ్డూ వివాదం.. ప్రాయశ్చిత్త దీక్ష.. ధర్మ రక్షణ బోర్డు గురించి ఆరా తీశారు.

గుంటూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసిన ప్రాయశ్చిత్తదీక్ష సందర్భంగా పవన్ హాట్ కామెంట్ చేశారు. 'తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్ఏడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. వైసీపీ పాలన కాలంలో ఇలాంటి నేతిని వినియోగించి తయారు చేసిన లక్ష లడ్డూలను శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రాము జన్మభూమి మందిరానికి తిరుమల తిరుపతి దేవస్థానం పంపి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచ మైన చర్య అని, ప్రతి హిందువు ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై కేబినెట్, అసెంబ్లీలో చర్చిచి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం ఉదయం వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. తిరుమలను హిందువులు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ

సంస్కరణల పేరుతో చాలా మార్పులు చేసి, స్వామివారి పూజా విధానాలను మార్చేసింది. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేశారు. ఐదుగురు కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వస్తే రూ. 50 వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ. 500 చొప్పునే ఇచ్చారు. నాతోపాటు చాలా మంది రాజకీయ నాయకులు దీనిపై ప్రస్తావించాం. తప్పు జరుగుతున్నదని వేలెత్తి చూపినా వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేద"ని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story