MODI: ప్రధాని మోదీపై మిత్రపక్షాల ప్రశంసల వర్షం

MODI: ప్రధాని మోదీపై మిత్రపక్షాల ప్రశంసల వర్షం
ఎన్డీయేను అధికారంలోకి తెచ్చేందుకు మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని కితాబు

ఎన్డీయేపక్ష నేతగా ఎన్నికైన మోదీపై మిత్రపక్షాల నేతలు ప్రశంసలు కురిపించారు. ఎన్డీయేను అధికారంలోకి తెచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడ్డారని చంద్రబాబు కొనియాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్ కు అందివచ్చిందని పేర్కొన్నారు. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని నితీశ్ కుమార్ చెప్పారు. గత పదేళ్లలో.. మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ కల్యాణ్ చెప్పారు.ఎన్డీయేపక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నిక సందర్భంగా ఆయనకు మిత్రపక్షాల నేతలు అభినందనలు తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేసుకొని ముందుకు సాగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. దూరదృష్టి కలిగిన మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయిస్తున్నారని, 2047నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.మోదీ నాయకత్వంలో భారతీయులు భవిష్యత్తులో ప్రపంచ నాయకులుగా ఎదగుతారనే నమ్మకం... తనకుందని పేర్కొన్నారు.


ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని JDU అధినేత నీతీశ్‌ కుమార్ హామీ ఇచ్చారు. ఇండి కూటమి దేశానికి చేసిందేమీ లేదన్న నితీశ్‌ తాజా ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు మొత్తం ఓడిపోతారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి... జనసేన సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. గత పదేళ్లుగా దేశానికి గుర్తింపు తీసుకురావడానికి మోదీ కృషిచేశారని చెప్పిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే..అవాస్తవాలను ప్రచారం చేసిన విపక్షాలను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు.

మరోవైపు... ఈ నెల 9 సాయంత్రం 6 గంటలకు... మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విశిష్ట అతిథులు హాజరు కానున్నారు. ఇప్పటికే... శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అధినేతలను ఆహ్వానించగా.... దేశానికి చెందిన ప్రముఖులు, ఎన్డీయే పక్షనేతలు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సినీ, క్రీడా రంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు..ఆహ్వానాలు పంపారు. ఇంకా కొంతమందిని కూడా ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు., పలువురు ట్రాన్స్ జెండర్లు, వందేభారత్ రైళ్లు సహా... పలు కీలక ప్రాజెక్టుల్లో పనిచేసినవారిని...మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించినట్లు చెప్పారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్నవారికి ఆహ్వానాలు పంపినట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story