TDP : ద్రౌపది ముర్ముకి మద్దతు తెలపటం గర్వించదగ్గ విషయం : చంద్రబాబు

TDP : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పార్టీల మద్దతు కూడగడుతున్నారు.. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ పర్యటనకు వచ్చారు.. ఇప్పటికే ముర్ముకు మద్దతు ప్రకటించిన టీడీపీ... విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఆమె పరిచయ కార్యక్రమం నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.. ద్రౌపది ముర్ముకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు ఘన స్వాతం పలికారు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారంతా పాల్గొన్నారు..
దేశ ప్రథమ పౌరుల ఎంపికలో భాగస్వామ్యం కావటం తమ అదృష్టమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపటం అంతా గర్వించతగ్గ విషయమన్నారు. ద్రౌపది ముర్ము సిన్సియార్టీకి ఎంతో గౌరవం లభిస్తుందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అయిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారని చెప్పారు.
సాధారణ పౌరులు అసాధారణ పదవికి ఎన్నిక కావటం మన రాజ్యాంగం విశిష్టత అని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ద్రౌపది ముర్మును బలపరచాలని నిర్ణయించామన్నారు. విజయవాడ తాజ్‌గేట్ వే హోటల్‌లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన ముర్ముకు పరిచయం చేశారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కోరారు ద్రౌపది ముర్ము. ఓ సోదరిగా తన అభ్యర్ధిత్వాన్ని బలపరిచిన టీడీపీకి కృతజ్ఞతలన్నారు. 75 ఏళ్ల దేశ స్వాతంత్రోత్సవాల్లో దేశ అత్యున్నత పదవి అధిష్టించేందుకు అంతా సహకరించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com