ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం నిన్నటితో (మార్చి 31) ముగియడంతో..

ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం నిన్నటితో (మార్చి 31) ముగియడంతో.. నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు.నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు అధికారులు అభినందనలు తెలిపారు. తనపైన విశ్వాసంతో ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్‌ హరిచందన్ కి నీలం సాహ్ని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ, ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story