శరవేగంగా మారుతున్న నెల్లూరు రాజకీయాలు

శరవేగంగా మారుతున్న నెల్లూరు రాజకీయాలు
ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ అయితే మరోవైపు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసానికి టీడీపీ నేతలు వెళ్లారు

నెల్లూరులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ అయితే మరోవైపు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసానికి టీడీపీ నేతలు వెళ్లారు. బ్రేక్‌ ఫాస్ట్ మీట్‌లో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి,బీదా రవిచంద్ర, అనగాని సత్యప్రసాద్‌తో ఆనం భేటీ కాగా..కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, బీదా రవీంద్ర చర్చలు జరిపి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు.ఇటీవలే టీడీపీలో చేరాడు కోటంరెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి.

నెల్లూరు టీడీపీ ఆఫీస్‌కు వెళ్లనున్న ఆనం.. అత్మకూరు నియోజక వర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.నెల్లూరు జిల్లాలోలోకేష్‌ పాదయాత్రకు స్వాగత ఏర్పాట్లలో ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు రంగమయూరి రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. అటు ఒంగోలు మహనాడు సందర్భంగా లోకేష్‌తో ఆనం కుమార్తె కూడా సమావేశమైంది. ఈ నేపధ్యంలో నెల్లూరులో లోకేష్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా భారీగా చేరికలు ఉండే అవకావాలు కనిపిస్తుంది.

పోలవరం సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు నుంచి బయల్దేరిన టీడీపీ నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిమ్మల రామానాయుడు, మద్దిపాటి వెంకటరాజు, బడేటి చంటి, గన్ని వీరాంజనేయులు సహా పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలవరం వెళ్లడానికి అనుమతి లేదని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తెగేసి చెప్పారు. అయితే పోలీసులను దాటుకుని మాజీ మంత్రి దేవినేని ఉమ బైక్‌పై పోలవరం వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story