AP Corona Cases: కొత్తగా 1,248 కేసులు.. 15 మంది మృతి

AP Corona Cases: కొత్తగా 1,248 కేసులు.. 15 మంది మృతి
AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ కేసులు నమోదువుతూనే ఉన్నాయి. కొత్తగా 1,248 కేసులు నిర్ధారణ అయ్యాయి

ఏపీలో కరోనా వైరస్ కేసులు నమోదువుతూనే ఉన్నాయి. కొత్తగా 1,248 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58,890 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,04,590 మంది వైరస్‌ బారినపడినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,61,98,824 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,750కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,77,163కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 1,715 మంది బాధితులు కోలుకున్నారు.



Tags

Next Story