ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,603 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 24 వేల 767కి చేరింది.

కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 88 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బారిన పడి 3,884 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 99,129 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారి నుంచి కోలుకుని 3,21,754 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story