ఏపీలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు

X
ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 34 వేల 771కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 85 మంది ప్రాణాలు కోల్పయారు. దీంతో ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 3,969 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,00,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుంచి 3,30,526 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 37.22 లక్షల కరోనా టెస్టులు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
