AP Corona Cases: ఏపీలో కరోనా బారినపడి 19 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా బారినపడి 19 మంది మృతి
AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,321 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,321 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,461 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,07,671 మంది కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,64,71,272 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,807కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,4 99మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,79,011కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.



Tags

Next Story