Corona Cases in AP: కొత్తగా 1546 కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంట్లోల కొత్తగా 15 వందలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..59,641 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,546మందికి పాజిటివ్ తేలింది.తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స 15 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,70008కు చేరింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5గురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరోవైపు 1,968మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,36016 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
#COVIDUpdates: 02/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,67,113 పాజిటివ్ కేసు లకు గాను
*19,33,121 మంది డిశ్చార్జ్ కాగా
*13,410 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,582#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/OOrdxjugFJ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com